*🔥గ్రూప్-1 దరఖాస్తు గడువు పొడిగింపు🔥* *▪️హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి గ్రూప్-1 దరఖాస్తు గడువును టీఎస్‌పీఎస్సీ మరో నాలుగు రోజులు పొడిగించింది. జూన్ 4వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మొత్తం 503 పోస్టులతో కూడిన గ్రూప్-1 ఉద్యోగ ప్రకటనకు మంగళవారం రాత్రి 11 గంటల వరకు 3,48,095 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలుత ప్రకటించిన గడువు ప్రకారం మంగళవారం (మే 31) చివరి తేదీ కావడంతో నిరుద్యోగులు ఆన్‌లైన్ దరఖాస్తులకు పోటెత్తారు. చివరి రెండురోజుల్లోనే 85,505 (24.56 శాతం) అప్లికేషన్లు రాగా, ఒక్క మంగళవారమే 48,093 దాఖలయ్యాయి. కమిషన్ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసినా, చివరి గంటలో రద్దీ ఎక్కువైంది. పరీక్షఫీజు చెల్లింపులకు డెబిట్, క్రెడిట్ కార్డుల సమస్యలు వచ్చాయి. కొందరు తొందరపాటులో తప్పుడు పిన్ నెంబరు నమోదు చేయడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో కొంత గడువు ఇవ్వాలంటూ అభ్యర్థుల నుంచి కమిషన్‌కు విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో రాత్రి 11.30 గంటల తరువాత గడువును జూన్ 4 వరకు పొడిగిస్తున్నట్లు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1కు నోటిఫికేషన్ జారీ చేసిన కమిషన్ మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది.* *💥ఉమ్మడి రాష్ట్రం కంటే అత్యధికం* *🌀2011లో గ్రూప్-1 కింద 312 పోస్టులు నోటిఫై చేస్తే ఉమ్మడి రాష్ట్రంలో 3,02,912 మంది దరఖాస్తు చేశారు. తాజాగా 2022 నోటిఫికేషన్‌తో వచ్చిన దరఖాస్తులు ఉమ్మడి రాష్ట్ర రికార్డును అధిగమించాయి. పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండటం, సుదీర్ఘ విరామం తరువాత ప్రకటన రావడమే దీనికి కారణమని తెలుస్తోంది.* *💥త్వరలో ‘ఎడిట్’ అవకాశం?* *💠గ్రూప్-1 దరఖాస్తు సమయంలో తప్పులు దొర్లకుండా రివ్యూ అవకాశం ఇచ్చినప్పటికీ కొందరు అభ్యర్థులు పుట్టినతేదీ, అర్హతలు, కళాశాల పేరు తదితర విషయాల్లో పొరపాట్లు జరిగాయని గుర్తించారు. దరఖాస్తులో తప్పులు సవరించుకునేందుకు ఎడిట్ అవకాశమివ్వాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై కమిషన్ సానుకూలంగా స్పందించనున్నట్లు సమాచారం.*
0 comments:
Post a Comment