మిత్రులకు నమస్తే.
కోవిడ్ మూలంగా గత రెండేళ్లుగా మన ఉపాధ్యాయ మిత్రులు, విద్యార్థులు తరగతి గదికి దూరంగా ఉన్నారు. ఇపుడిపుడే మళ్లీ బడులు తెరుచుకున్నా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయం నెలకొంది. ఆన్‌లైన్ అనేది ప్రధాన మాధ్యమం గా మారిపోయిన ఈదశలో కొత్త కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవలసిన అవసరం ఏర్పడింది. ఈ నేపధ్యంలో
BRAOU యొక్క సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ (CSTD) ఆన్‌లైన్ కోర్సు లు ఎలా రూపొందించడంలో ఒక కొత్త course రూపొందించింది. ఈ course లో ఉపాధ్యాయులు ఎవరైనా చేరవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. మీ తీరిక సమయంలో MOOC వేదిక గా ఇంటినుంచే పూర్తి చేయవచ్చు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, UGC నిర్వహిస్తున్న SWAYAM portal కు కూడా పాఠాలు పాఠ్యాంశాలు ఎలా రూపొందించాలో చెపుతారు. రెండు వారాల్లో మీరు నిపుణులుగా మారేలా తీర్చి దిద్దుతారు. ఈ కోర్సును కామన్వెల్త్ ఎడ్యుకేషనల్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా (CEMCA) రూపొందించింది, ఇది డిసెంబర్ 20, 2021 నుండి ప్రారంభమవుతుంది. కోర్సు పూర్తయిన తర్వాత CEMCA మరియు BRAOU సంయుక్తంగా ఒక సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.
ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులను చేరుకోవడానికి CSTD దేశవ్యాప్తంగా దీన్ని అందిస్తోంది. చేరడానికి, అధ్యాపకులు మరియు పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులకు ఉపయోగం. ఫీజు లేదు, వయో పరిమితి లేదు మరియు ఇతర పరిమితులు లేవు. పూర్తయిన తర్వాత, మీరు సొంతగా SWAYAM కోసం కోర్సులను అభివృద్ధి చేయవచ్చు,వెంటనే ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. https://forms.gle/hB4nm7isJsiPkKw47
ధన్యవాదాలు.
ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మరియు
డైరెక్టర్ CSTD-BRAOU
0 comments:
Post a Comment